"మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు"

9.Printf ఉపయోగించి కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం • Write A Program To Print Your Name and Age At Output


#include<stdio.h>
#include<conio.h>


void main()
{

          clrscr();


          printf("sivanaadh baazi");
          printf("22");

          getch();
}
ఇప్పుడు మనం పైన వ్రాసిన ప్రోగ్రాం output ఈ క్రింది విధంగా రావాలి 

sivanaadhbaazi
22

ఇలా పైన చూపిన విధంగా output రావాలి కానీ output పైన చూపిన విధంగా రాదు. కరెక్ట్ output అనేది క్రింద చూపించిన విధంగా ఒక దాని ప్రక్కన ఒకటి ప్రింట్ అవుతుంది ఇప్పడు మీకు ఒక సందేహం (డౌట్) రావచ్చు. ఇలా ప్రక్కప్రక్కన ప్రింట్ అయ్యేటప్పుడు ఒకే printf statement లో వ్రావచ్చు గా అని . అవును మీ సందేహం  కరెక్ట్ నే కాబట్టి  పైన వ్రాసిన  ప్రోగ్రాం ని క్రింద వ్రాసిన విధంగా కూడా వ్రాయవచ్చు ..
#include<stdio.h>
#include<conio.h>

void main()
{
          clrscr();

          printf("sivanaadh baazi 22");

          getch();
}ఈ ప్రోగ్రాం output కూడా same పైన చూపిన విధంగా నే వస్తుంది అంటే ప్రక్కప్రక్కన ప్రింట్ అవుతుంది . కాని మనకి కావాల్సింది ఒకదాని క్రింద ఒకటి ప్రింట్ అవ్వాలి ...ఒకదాని క్రింద ఒకటి ప్రింట్ అవ్వాలి అంటే మనం " C Language " లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ని Printf Statement లో వ్రాయాలి . ఆ క్యారెక్టర్ ఏమిటి అంటే ..

\n --- అంటే కొత్త వరుస అని (New Line )


సరే ఇప్పుడు కరెక్ట్ గా ఒకదాని క్రింద ఒకటి ఎలా ప్రింట్ అవ్వాలో ప్రోగ్రాం వ్రాద్దాం 

 • Write A program To print Your Name And Age Line By Line..పైన  ప్రోగ్రాం  లో  \n (New line) ని 1st printf Statement లో చివర వ్రాసిం కాబట్టి మనకి output అనేది  1st printf Statement వున్నది మొదటి వరుసలో ప్రింట్ అవ్వి మిగతాది మొత్తం రెండోవ వరుస లో ప్రింట్ అవుతుంది 

పైన ప్రోగ్రాం ని క్రింద చూపిన విధంగా కూడా వ్రాయవచ్చు 


ఈ ప్రోగ్రాం లో ఒకే ఒక printf statement ఉంది ఇందులో  \n ( New Line ) అనేది మద్యలో ఉంది కాబట్టి ఎక్కడైతే new line ( \n ) ఉందో అక్కడ నుండి ఉన్నది మొత్తం రెండోవ వరుస లో ప్రింట్ అవుతుంది  


పైన వ్రాసిన రెండు ప్రోగ్రామ్స్ కి ఒకే విధంగా output వస్తుంది ఈ output క్రింద చూపించిన విధంగా వుంటుంది ..ఇప్పుడు మీకు \n మీద ఒక ఐడియా వచ్చి వుంటుంది. \n ( New Line ) ని మీరు printf statement లో ఎక్కడైనా వ్రావచ్చు ఎక్కడైతే \n ( New Line )  వ్రాస్తామో అక్కడ నుండి ఉన్నది మొత్తం ఇంకొక వరుస లో ప్రింట్ అవుతుంది output లో ..............
మరికొన్ని Examples Printf గురించి వ్రాద్దాం • Write a Program To print U R Bio-Data at output


#include<stdio.h>
#include<conio.h>

void main()
{
          clrscr();
  
         printf("name=sivanaadh baazi");
         printf("age=22");
         printf("gender=male");
         printf("father name=satyanarayana");
         printf("mother name= malleswari");
         printf("qualification=BTech");          getch();
}
ఈ ప్రోగ్రాం Output ఈ క్రింద చూపించిన విధంగా వుంటుంది 

output:

name=sivanaadh baazi age=22 gender=male father name=satyanarayana mother name=malleswari qualification=BTech 

ఒకదాని ప్రక్కన ఒకటి ప్రింట్ అవుతుంది ఎందుకంటే మనం అక్కడ \n ( New line ) అనేది ఎక్కడ ఉపయోగించలేదు .ఇంకో ప్రోగ్రాం చూద్దాం
#include<stdio.h>
#include<conio.h>

void main()
{
          clrscr();
         printf("name=sivanaadh baazi \n");
         printf("age=22");
         printf("gender=male
\n ");
         printf("father name=satyanarayana");
         printf("mother name= malleswari
\n");
         printf("qualification=BTech");

          getch();
}
పైన ప్రోగ్రాం లో New line ( \n ) అనేది 1,3,5 printf statements చివరలోనే వున్నాయి కాబట్టి వాటి తరవాత ఉన్నది మాత్రమే ఇంకో వరుసలో ప్రింట్ అవుతుంది

Ouput:

name=sivanaadh baazi age=22 gender=male
father name=satyanarayana mothername=malleswari
qualification=BTech 


హ హ ఇలా printf statement లో New Line ని మనకి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు ...............
ప్లీజ్  కామెంట్ వ్రాయడం మర్చి పోకండి సుమా :) :) :) 

8 కామెంట్‌లు:

 1. Very nice sivanaadh gaaru. Thanks a lot for sharing knowledge about C. Please if possible include Datastructures also.

  రిప్లయితొలగించండి
 2. very helpful i thank you a lot.i mainly appreciate you for writing in Telugu.i referred many sites but no site is helpful as yours.i wish you get good name by this site.

  రిప్లయితొలగించండి
 3. Chala బాగుంది మీ teaching thank you very much sir

  రిప్లయితొలగించండి

ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని వ్రాయండి