"మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు"

కంప్యూటర్ కి మానవుడి కి సంబంధం ఏమిటి ? కంప్యూటర్ లో రెండు మెమరీ లు ఎందుకు ?


కంప్యూటర్ అనేది మానవుడి శరీరం ఆధారం గా తయారుచేయబడింది . అంటే మానవుడి శరీరంలో భాగాలు కాళ్ళు చేతులు కళ్ళు నోరు ..  ఇలా అన్ని కలిసి ఎలా పనిచేస్తాయో  అలాగే కంప్యూటర్ లో కూడా కళ్ళు నోరు చేతులు ఉంటాయి
మానవుడి శరీరంలో భాగాల కి  సమానమైన కంప్యూటర్ భాగాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ...

నాకు తెలిసినంత వరకు మనిషి అంటే ముఖ్యంగా ఉండేది తల ,కాళ్ళు ,చేతులు క్రింద బొమ్మలో చూపించిన విధంగా అంతే కదా
computer in telugu

 తల:

మనకి తలలో మళ్ళి  ముఖ్యమైన భాగాలు కళ్ళు ,నోరు , చెవులు , మెదడు (బ్రెయిన్) అండి . ఇప్పుడు తలలో ఒక్కొక్క భాగం ఎలా పనిచేస్తుంది మరియు కంప్యూటర్  సమానమైన పరికరం ఏమిటో చూద్దాం .
కళ్ళు : మనం కళ్ళతో ఏం చేస్తాం చూస్తాం , చూడడం అంటే మన కళ్ళు ఫోటో తీయడం లేదా వీడియో తీయడం చేస్తున్నాయి అని , అంటే ఇక్కడ కళ్ళు ఒక కెమెరా లాగా పనిచేస్తున్నాయి. కాబట్టి కంప్యూటర్ లో కూడా మన కళ్ళు లాగా ఫోటో లేదా వీడియో తీసే పరికరం ఉంది అదేమిటంటే " వెబ్ క్యాం ( webcam ) ". వెబ్ క్యాం అంటే అర్ధం కాలేదా అదేనండి బ్యాంకు లలో గోడకి ఒక కెమెరా తగిలించి ఉంటుంది వచ్చే పోయే వాళ్ళని రికార్డు చేస్తుంటుంది (  సి సి కెమెరా ) అలాంటిది .  దాని పని కళ్ళు లాగా ఫోటో తీయడం అంతే . హమ్మయ్య ఎంత బాగా చెప్పానో  :) 
computer in telugu
నోరు :  మనం నోటితో ఏం చేస్తాం భోజనం చేస్తాం కదా  ఎప్పుడు చూడు మనకి తిండి గోలే .. నోటితో తినడంతో పాటు మనం చేసే పని మాట్లాడటం . మనం నోటితో శబ్దం చేస్తాం .. మీరు పాట పాడలనుకొండి నోటిని ఉపయోగించే కదా పాడేది .ప్లీజ్ కొంపతీసి ఇప్పుడు మీరు పాట పాడటం లేదు గా :) , అంటే మన శరీరం లో సౌండ్ చేసేది నొరు. ఇలాగే కంప్యూటర్ లో పాటలు వినాలంటే సౌండ్ చేసే పరికరం స్పీకర్స్ ( Speakers ) .
చెవులు : ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి మీకు ఐ లవ్ యు అని చెప్పింది అనుకో , అరే బాబాయ్ సిగ్గుపడటం ఆపి తర్వాత మ్యాటర్ చదువు :) . దేనితో వింటావ్ చెవి తో నే కదా . అంటే చెవులు శరీరం బయట ప్రపంచంలో జరిగే ధ్వని ( శబ్దం )ని మన మెదడుకి చెవుల ద్వారా చేరవేస్తాయి . చెవుల పని ఏంటి వినడం కదా అలాగే కంప్యూటర్ లో అలా శబ్దాన్ని వినడానికి మైక్రో ఫోన్ ( Microphone ) అని ఉంటుంది. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ స్టేజి  ఎక్కి పడేటప్పుడు తలకి హెడ్ఫోన్ పెట్టి నోటి దగ్గర ఒకటి ఉంటుందే అదే . 
computer in telugu
మెదడు : ఇప్పుడు పైన చెప్పుకున్న కళ్ళు చెవులు కాళ్ళు .. ఇలా మన శరీరం లో బాగాలు అన్ని పని చేయాలంటే మెదడు పనిచేయాలి అన్న విషయం మీకు తెలుసుగా .
మెదడు ఏం చేస్తుంది మనం చేసే పనులను గుర్తుంచుకుంటుంది అంతే కదా . ఇప్పుడు నేను ఏదైనా చదివాను అనుకోండి అది మన మెదడు లోనే కదా దాచుకునేది ( స్టోర్ చేసుకుంటుంది  ) .
అంటే ఇప్పుడు మీకు ఒకటి అర్ధం అయింది మెదడు అనేది దేనికి అంటే గుర్తుంచుకోవడానికి అని , గుర్తుంచుకోవడం అంటే నేర్చుకొని బ్రెయిన్ లో దాచుకోవడం ఓకే కదా


అరే ఎప్పుడు మీకు చదువేనా ఇప్పుడు ఒక చిన్న కధ చెప్పుకుందాం .. చిన్నప్పుడు అంటే నాకు ఒక 8 నెలలు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను నేల మీద పడుకోబెట్టింది .. మనం ఊరుకుంటామా ఢంకా చిక ఢంకా చిక అని బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ పాడుకుంటూ , పాకుతూ ఇల్లంతా గిరా గిరా తిరిగేశాను . ఇలా ఇల్లు తిరిగే క్రమంలో ఎదురుగా గోడ మీద శ్రీదేవి ఫోటో కనపడింది ఆ ఫోటో చూసి నేను అప్పుడే  శ్రీ దేవి కి ఫిదా అయి పోయి మెల్లగా అ గోడ వైపు వెళ్ళాను కాసేపు అక్కడే ఫోటో చూస్తూ ఉండిపోయాను అలా చూస్తూ పక్కకి తిరిగాను ఎదురుగా ఉన్న రూం లో ఒక గిన్నె ఉంది దానిలో నుండి మెల్లగా పొగలు వస్తున్నాయి . నేను అలా పొగలు వస్తున్నా గిన్నెని చూడటం అదే మొదటిసారి ఇంకా చూస్కో లబకు లబకు  అని పాక్కుంటూ గిన్నె దగ్గరికి వెళ్ళి జగన్ CM సీటు కోసం ఆశ గా చూస్తున్నట్టు నేను కూడా అలాగే ఆ గిన్నె వైపు చూస్తూ కొంచం సేపు అయిన తర్వాత చిరంజీవి శ్రీదేవి నడుము పై చెయ్యి వేసినట్టు నేను కూడా స్టైల్ గా గిన్నె పై చెయ్యి వేశాను ఇంక చూసుకో నాకు నా కళ్ళ ముందే సిల్క్ స్మిత డాన్స్ కనపడింది దెబ్బకి ఒకే ఒక పెద్ద కేక వేశాను దెబ్బకి మా అమ్మ పరుగెత్తుకొచ్చి నన్ను రెండు పీకింది వెధవ ఉన్న చోట ఉండవా అని . ఇంతకీ ఆ గిన్నెలో ఏం ఉంది అనుకుంటున్నారా సల సలా కాగే వేడి నీళ్ళు :)
 COMPUTER IN TELUGU

తర్వాత రోజు మళ్ళి మా అమ్మ నన్ను క్రింద నేల మీద పడేసింది అప్పుడు మళ్ళి నాకు ఎదురుగా ఉన్నరూం లో సల సలా కాగే వేడి నీళ్ళ గిన్నె కనపడింది మళ్ళి నేను లబకు లబకు అని పాకుతూ గిన్నె దగ్గరికి వెళ్ళాను కాని ఈ సారి గిన్నె ని ముట్టుకోలేదు ఎందుకు ? ముట్టుకునే ముందు నాకు నిన్న ముట్టుకుంటే  ఏం జరిగిందో సినిమా రూపం లో కనపడింది అందుకే ముట్టుకోకుండా అంతే స్పీడ్ గా వెనక్కి వచ్చేసాను .
హమ్మయ్య ఇంక ఆపరా బాబు నీ సోది అనుకుంటున్నారా , బాబాయ్ కూల్ .. ఇదంతా చెప్పింది దేనికి అంటే ఇప్పుడు నాకు మొదటిసారి వేడి నీళ్ళ గిన్నెని ముట్టుకుంటే కాలుతుంది  తెలియదు అదే రెండోసారి ముట్టుకోబోతుంటే నా మెదడు నాకు ఏం చెబుతుంది ఓరే సుంటా ముట్టుకుంటే కాలుతుంది ముట్టుకోవద్దు అని. , అంటే మన మెదడు అంతకముందు నాకు కాలిన విషయాన్ని గుర్తుంచుకొని రెండవ సారి ముట్టుకునే ముందు అది మొదటి సారి జరిగిన దాన్ని గుర్తుతెచ్చుకొని మనల్నిఆ గిన్నెని ముట్టుకోవాల వద్దా అని నియంత్రిస్తుంది (డెసిషన్ తీసుకుంటుంది ).
అంటే ఇప్పుడు మన మెదడు రెండు రకాల పనులు చేస్తుంది అవి 
 1. గుర్తుంచుకోవడం (మెమరీ Memory )
 2. నిర్ణయాలు ( డెసిషన్ )  తీసుకోవడం (  ప్రాసెసర్ processor )
ఇలా మెదడు లాగా గుర్తుంచుకొని నిర్ణయాలు తీసుకునే పరికరం కంప్యూటర్ లో CPU ( Central Processing Unit ) ఇప్పుడు ఈ రెండు పనుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం

1. గుర్తుంచుకోవడం (మెమరీ Memory ):

మన మెదడు లో ముఖ్యంగా 3 రకాల భాగాలూ ఉంటాయి పెద్ద మెదడు , చిన్న మెదడు & మెడుల్లా ఆబ్లాంగేటా క్రింద ఫోటోలో  చూపించిన విధంగా ఉంటాయి
telugu lo computer


 నాకు ఎప్పటి నుండో ఒక చిన్న డౌట్ ఉంది ?
ఏదో చిన్నపిల్లోడిని నేను అడిగే ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయి మరి కోపడకూడదు .. మీ అమ్మని చూడగానే మీరు అమ్మ అని టక్కున ఎలా చెబుతున్నావు ?

ఓరిని ఇది కూడా ఒక ప్రశ్న నా హ హ హ ... ఏముంది రోజు మీ అమ్మని చూస్తావు కదా అలా చెబుతావు  అంతే అంటావా ఓకే అదే ఆ గుర్తుపట్టే పని ఎలా జరుగుతుంది అంటాను నేను ?

అది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు నేను మా అమ్మని చూడగానే నా కళ్ళు ఫోటో తీస్తాయి  అలా తీసిన ఫోటో ని మన మెదడు లో ఉన్న ఫొటోస్ తో ఒక్కొక్కటి సరి పోల్చుకుంటాయి ఎప్పుడైతే మా అమ్మ ఫోటో నా మెదడు లో ఉన్న ఫొటోస్ తో సరిపోతుందో అప్పుడు ఆ ఫోటో పక్కనే అమ్మ అని బ్రెయిన్ లో రాసుకొని వుంటాను దానిని చెబుతాను అంతే .
ఇప్పుడు నేను మా అమ్మని   గుర్తు పట్టలేదనుకోండి దాని అర్ధం ఏమిటి అంటే బ్రెయిన్ లో మా అమ్మకి సంబందించిన ఫోటో పోయింది అని , దీన్నే కొన్ని ఏరియా లలో వీడికి బ్రెయిన్ దొబ్బింది అంటారు .

సరే ఇప్పుడు  ఇంకో ప్రశ్న ?
నీతో పాటు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న వాడు 15 సంవత్సరాలు తర్వాత ఇప్పుడే కనిపించాడు అనుకోండి నువ్వు వెంటనే గుర్తు పట్టలేవు కొంచం టైం తీసుకుంటావ్ . At least  మీ అమ్మ ని గుర్తు పట్టే టైం కన్నా 1 సెకండ్ అయినా ఆలస్యం అవుతుంది వాడిని గుర్తు పట్టటానికి ఎందుకని ? మీ అమ్మ ఫోటో నీ  బ్రెయిన్  లోనే ఉంది అలాగే వాడి ఫోటో కూడా నీ బ్రెయిన్ లోనే ఉంది మరి ఎందుకని ఆలస్యం అవుతుంది ? అసలు చిన్న మెదడు పెద్ద మెదడు దేనికి ఒక్కటే ఉండవచ్చు గా ?


అమ్మ ని అంటే రోజు చూస్తాం కాబట్టి , వాడిని అయితే రోజు చూడం కదా అంటారా .yes మీరు చెప్పింది కరెక్ట్ నే కానీ ఒక చిన్న సందేహం ఉంది

నాకు ఒక కంపెనీ ఉంది అనుకోండి నా దగ్గర పని చేసే వాళ్ళ ఫోటో లు అన్ని నాదగ్గర ఉన్నాయి అనుకోండి ఒకే నా , మొత్తం నా దగ్గర ఒక 1000 ఫోటో లు ఉన్నాయి ( ఇప్పటి వరకు నా దగ్గర పనిచేసిన వాళ్ళు + ప్రస్తుతం నా దగ్గర పనిచేసే వాళ్ళ ఫోటోలు ) . ఈ 1000 ఫోటో లు ఒక బాక్స్ లో  ఉన్నాయి . అందులో ఒక పది మంది మాత్రమే ప్రస్తుతం నా దగ్గర పని చేస్తున్నారు నేను ప్రతి రోజు వాళ్ళ ఫోటో లు ఆ బాక్స్ లో నుండి తీసి వాళ్ళకి attendance వేస్తాను అనుకోండి . ప్రతి రోజు నేను ఇలా ఈ 10 మంది ఫోటోలు 1000 ఫొటోస్ లో నుండి తీసి చూడాలంటే చాలా టైం పడుతుంది . కాబట్టి అప్పుడు నేను ప్రతిరోజూ చూసే 10 ఫోటో లను తీసి ఇంకో ఒక చిన్న బాక్స్ లో పెట్టుకుంటా . ఇలా అయితే నాకు చాలా తేలికగా పని అవుతుంది అంతే కదండీ రోజు ఒక 1000 ఫోటో లలో నుండి 10 ఫోటో లు రోజు తీయ్యడం కష్టం కదా కానీ అదే ఫోటోస్ ని పక్కన వేరుగా ఇంకో బాక్స్ లో పెట్టుకుంటే త్వరగా చూసుకోవచ్చు కదా. సరే ఇప్పుడు నాకు నా దగ్గర పని చేసి వెళ్ళిపోయినా వారిలోఒక ఫోటో కావాలి ఆ ఫోటో రోజు చూసే 10 ఫొటోస్ ఉండే బాక్స్ లో ఉంటుందా ఉండదు కదా ఇప్పుడు నేను 1000 ఫొటోస్ ఉండే పెద్ద బాక్స్ లో వెతకాలి అంటే కొంచం టైం పడుతుంది . ఈ ఫోటో నాకు వరుసగా ఒక నెల రోజుల పాటు కావాలి అనుకోండి . ఈ నెల రోజులు ప్రతి రోజుపెద్ద బాక్స్ 1000 ఫోటోలలో వెతికి తియ్యాలంటే కష్టం కదా అందుకని ఈ ఫోటో ని కూడా నేను చిన్న బాక్స్ లో 10 ఫొటోలతో కలిపి (10+1) పెడతా . 11 ఫోటోలలో వెతికి తియ్యడం Easy నా లేక 1000 ఫోటోలలో వెతికి తియ్యడం Easy నా. చిన్న బాక్స్ లో నే వెతకడం Easy కదా సరే నెల రోజుల తర్వాత నాకు ఈ ఫోటో తో పని లేదు అప్పుడు ఈ చిన్న బాక్స్ లో ఈ ఫోటో తో ఉంచాల్సిన అవసరం లేదు కదా . సరే ఉంచితే ఏమైద్ది అనుకుందాం పెద్దగా problem ఏం ఉండదు కదా అనుకుంటున్నారా .

ఇప్పుడు కొత్తగా ఒక employee నా కంపెనీ లో జాయిన్ అయ్యాడు అనుకుందాం వాడి ఫోటో కూడా నా దగ్గర ఉంటుంది కదా అది పెద్ద బాక్స్ లో 1000 ఫొటోస్ లో వేస్తాను కదా  అంతే కదా ప్రతి ఫోటో ముందు పెద్ద బాక్స్ లోనే వేస్తాను కదా తర్వాత నాకు అవసరం కాబట్టి అందులోనుండి తీసి చిన్న బాక్స్ లో వేస్తాను కదా ఇప్పుడు ఇలాగే కొత్తగా జాయిన్ అయిన employee ఫోటో కూడా నాకు రోజు కావాలి కాబట్టి 1000 ఫోటో లలో ఉంటే కష్టం కదా కాబట్టి నేను ఈ ఫోటో తీసి చిన్న బాక్స్ లో వేద్దామనుకున్నా కాని చిన్న బాక్స్ లో 11 ఫోటో లు మాత్రమే పడతాయి already అందులో 11 ఫోటోలు (10+1) ఉన్నాయి కానీ ఈ ఫోటో ఇందులో పెట్టాలి ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈ 11 ఫోటోలలో ఒక ఫోటో తో నాకు పని రోజు ఉండదు కాబట్టి దాన్ని తీసి ,  కొత్త employee ఫోటోని పెద్ద బాక్స్ నుండి చిన్న బాక్స్ లోకి మారుస్తా . ఇప్పుడు అర్ధం అయిందా పని లేని ఫోటోలని చిన్న బాక్స్ లో నుండి తీసి పెద్ద బాక్స్ లో వేసేయాలి లేకపోతే కొత్తగా వచ్చే వాటికి place ఉండదు .
అంటే చిన్న బాక్స్ లో ఫొటోస్ Temporary అదే పెద్ద బాక్స్ లోవి Permanent  
హమ్మయ్య ఇప్పుడు పైన చెప్పిన స్టొరీ లో పెద్ద బాక్స్ place లో పెద్ద మెదడు ని చిన్న బాక్స్ place లో చిన్న మెదడుని ఊహించుకోండి .
ఇప్పుడు మొదటి సారి  మీ అమ్మని చూడగానే కళ్ళు ఫోటో తీసి పెద్ద మెదడు లో పెడతాయి అలాగే ప్రతి ఒక్కరివి అంతే ఫోటో తీసి పెద్ద మెదడు లో దాచుకుంటాయి అక్కడే ఫొట పక్కన పేరు రాసుకుంటాయి . ఇప్పుడు ప్రతి రోజు మీ అమ్మని చూస్తావు కాబట్టి ఫోటో ని పెద్ద మెదడు నుండి చిన్న మెదడు లో పెట్టుకుంటాయి ఇలా ఎందుకు అంటే పైన చెప్పాను కదా వెతికే టైం తగ్గటానికి అని , పెద్ద మెదడు లో అన్ని ఉంటాయి కానీ చిన్న మెదడులో కొన్నే ప్రతి రోజు చేసే పనులు మాత్రమే ఉంటాయి  . సరే ఇప్పుడు ఎప్పుడో 15 సంవత్సరాలు క్రితం చుసిన వాడిని గుర్తు పట్టాలంటే ముందు చిన్న మెదడు లో వెతుకుతుంది కాని అది అక్కడ ఉండదు కదా కాబట్టి పెద్ద మెదడు లో వెళ్లి వెతికి అక్కడ నుండి చిన్న మెదడు లో  వచ్చి అప్పుడు గుర్తు పడుతుంది . అందుకని కొంచం టైం పడుతుంది .
అంటే మనం చూసే ప్రతిది ముందు పెద్ద మెదడు లో store అవుతుంది . చిన్న మెదడు లో మనం ప్రస్తుతం+రోజు చేసే పనులను మాత్రమే ఉంచుతుంది . రోజు చేసే పనులు కొన్ని రోజులు చేయలేదనుకొండి అక్కడ నుండి చిన్న మెదడు లో నుండి  తీసి పెద్ద మెదడు లో పెడుతుంది .
ఉదాహరణకు : ఇప్పుడు 10th class వరకు మనకు సోషల్ స్టడీస్ ఉంటాయి తర్వాత ఇంటర్ లో వెళ్ళితే సోషల్ ఉండదు . ఇంటర్ లో ఉన్నప్పుడు సోషల్ గురించి అడిగితే మెల్లగా గుర్తు తెచ్చుకుంటూ చెబుతావు అదే 10th class లో అడిగితే టక్కున చెబుతావు . 10th లో ఉన్నప్పుడు సోషల్ ప్రతి రోజు చదువుతావు కాబట్టి సోషల్ నీ చిన్న మెదడు లో ఉంటుంది కాని 10th అవ్వగానే కొన్ని రోజులు వరకు సోషల్ subject అనేది చిన్న మెదడు లోనే ఉంటుంది మన చిన్న మెదడు లో ఒక system అనేది ఉంటుంది అది ఏమి చేస్తుందంటే ఒక పని కొన్ని రోజులు చేయకపోతే ఇక్కడ నుండి తెసి పెద్ద మెదడు లో పెట్టమని కాబట్టి  ఇంటర్ లో ఉన్నప్పుడు అది పెద్ద మెదడు నుండి తీసుకోని వచ్చి చిన్న మెదడు లో పెట్టి మనకి గుర్తు చేస్తుంది . మనం చేసే ప్రతి పని మనం చని పోయే వరకు పెద్ద మెదడు లోనే store చేసి ఉంటుంది కానీ దాని నుండి తెచ్చుకోవడమే కష్టం దీన్నే మనం మర్చిపోవడం అంటాం .

హమ్మయ్య దీన్ని బట్టి ఏం అర్ధమైది చిన్న మెదడు పెద్ద మెదడు అని రెండు ఉంటే స్పీడ్ గా మన శరీరం పని చేస్తుంది అని కదా కంప్యూటర్ ని కూడా ఎందుకు కానీ పెట్టింది స్పీడ్ గా పని చేయడానికే  గా .
ఇలా చిన్న మెదడు , పెద్ద మెదడు లాగా కంప్యూటర్ లో కూడా మెమరీ ఉంటుంది . అవి ప్రైమరీ మెమరీ (Primary Memory ) , సెకండరీ మెమరీ (Secondary Memory )
చిన్న మెదడు = ప్రైమరీ మెమరీ (Primary Memory ) Ex:RAM 
పెద్ద మెదడు = సెకండరీ మెమరీ (Secondary Memory ) Ex: Hard Disk,Memory Card,CD,DVD.. 
ప్రైమరీ మెమరీ లో ప్రస్తుతం జరిగే పనులు ఉంటాయి . సెకండరీ మెమరీ లో మొత్తం మనం దాచుకునే ఇన్ఫర్మేషన్ పర్మనెంట్ గా మనం delete చేయనంత కాలం ఉంటుంది . కానీ ప్రైమరీ మెమరీ లో data అనేది కంప్యూటర్ switch off చేస్తే పోతుంది on చేయగానే మళ్ళి ప్రస్తుతం జరిగే పనులని సెకండరీ మెమరీ నుండి కాపీ చేసుకొని ఆ పని పూర్తీ చేస్తుంది . ప్రైమరీ మెమరీ లేకపోతే కంప్యూటర్ అనేది పని చెయ్యదు .
 ఉదాహరణకు :ఇప్పుడు మీకు ఒక ఖాళీ ప్రదేశం ఉంది అందులో మీరు ఒక ఇల్లు కట్టారు అనుకోండి automatic గా అ ఇంటికి రెండు properties వస్తాయి 1. డోర్ నెంబర్ (Address ) 2. ఆ ఇల్లు కొంత స్థలం ఆక్రమిస్తుంది 
 అసలు  డోర్ నెంబర్ (Address ) అనే ఒక పద్దతిని ఎందుకు ప్రవేశపెట్టారు ఎందుకంటే ఇప్పుడు ఒక కాలనీ లో కొన్ని ఇల్లు ఉన్నాయి అవి అన్ని ఒకే లాగా ఉన్నాయి అనుకోండి


ఇప్పుడు మీరు ఆ ఇండ్లల్లో ఒక వ్యక్తిని కలవాలి కానీ వాడు మీకు ఒక్కటే చెప్పాడు మా ఇల్లు ఇలా అలా ఉంటుంది అని కాని అక్కడికి వెళ్ళి చూడగానే అన్ని ఇల్లు ఒకేలాగా ఉన్నాయి అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఒక్కొక్క ఇల్లు వెతుకుంటూ వెళ్తావ్ ఇలా అయితే చాలా టైం పడుతుంది అని నువ్వు వెతకలేదు . కానీ వాడు ఇంకో సారి నీకు ఏం చెప్పాడు అంటే డోర్ నెంబర్ అప్పుడు నువ్వు టక్కున వాళ్ళ ఇంటికి వెళ్లి పోయావు . అంటే ఇప్పుడు డోర్ నెంబర్ దేనికి అంటే టైం వేస్ట్ కాకుండా త్వరగా వెళ్ళిపోవడానికి ఓకే నా .


మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది అనుకోండి అందులో మెమరీ కార్డు ఉంది కదా, ఇక్కడ మెమరీ కార్డు అనేది పైన చెప్పినట్టు ఒక ఖాళీ స్థలం అనుకోండి అందులో నేను అత్తారింటికి దారేది 1st సాంగ్ వెశాను అనుకోండి అప్పుడు ఆ సాంగ్ మెమరీ కార్డు లో కొంత ప్లేస్ ఆక్రమిస్తుంది ( దీనిని మనం bit, byte, kilo byte,mega bye ,giga byte ల లో కొలుస్తాం ) మరియు వెంటనే ఒక నెంబర్ ఇస్తుంది దీనినే అడ్రస్ లొకేషన్ (Address Location ) అంటారు.  అడ్రస్ లొకేషన్ దేనికి అంటే డోర్ నెంబర్ లాగా ఇది అన మాట త్వరగా అక్కడికి వెళ్ళడానికి . అంటే మెమరీ లో ఏం store చేసినదానికి ఒక నెంబర్ ఆటోమేటిక్ గా వస్తుంది దాన్నినే అడ్రస్ లొకేషన్ అంటాం

ఇప్పుడు నేను సెల్ ఫోన్ లో సాంగ్ ప్లే చేయాలి అనుకుంటే మ్యూజిక్ ప్లేయర్ లో కి వెళ్ళి ప్లే చేస్తాను అంతే కదా .ఓకే మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేయగానే సాంగ్ లిస్ట్ కనబడుతుంది కదా ఒక సాంగ్  క్లిక్ చేయగానే సాంగ్ ప్లే అవుతుంది కదా ఇక్కడ అసలు ఎం జరుగుతుంది అంటే మెమరీ కార్డు అనేది సెకండరీ మెమరీ కి ఉదాహరణ కదా ఇప్పుడు సాంగ్ ప్లే చేయాలి అంటే అది ముందు సెకండరీ మెమరీ లోనుండి ప్రైమరీ మెమరీ అంటే RAM ( Random Access memory ) లో కి కాపీ చేసుకుంటుంది తర్వాత RAM లో నుండి మ్యూజిక్ ప్లేయర్ లో ప్లే అవుతుంది .
ఒకటి గుర్తుంచుకోండి సెల్ ఫోన్ కూడా కంప్యూటర్ లాంటిదే ప్రైమరీ మెమరీ (RAM ) సెకండరీ మెమరీ (Memory Card ) రెండు ఉంటాయి
సెల్ ఫోన్ లో ఎలా అయితే జరిగిందో కంప్యూటర్ లో కూడా అంతే . సెల్ ఫోన్ లో అయితే సెకండరీ మెమరీ కి example మెమరీ కార్డు అదే కంప్యూటర్ లో అయితే హార్డ్ డిస్క్ లు , CD , DVD ...
 • సెకండరీ మెమరీ లో ఇన్ఫర్మేషన్ పర్మనెంట్ నువ్వు Delete (తీసివేస్తే ) కానీ పోదు అంతే కదా మీఉ మెఒర్య్ కార్డు లో ఉంచిన సాంగ్ మీరు delete చేస్తే గాని అందులో నుండి పోదు . 
 • ప్రైమరీ మెమరీ మాత్రం temporary పని అవ్వగానే delete చేస్తుంది కంప్యూటర్ ఆఫ్ చేస్తే కూడా అందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు మళ్ళి ఆన్ చేసినప్పుడు అంతా ఫ్రెష్ గజిని లాగా :)
ఇప్పటి వరకు  చెప్పుకున్నాం మనం నేర్చుక్కున్న విషయాలు బ్రెయిన్ లో ఎలా store అవుతాయి అని కదా . కానీ మనం బ్రెయిన్ కి మనం నేర్పించాకుండానే కొన్ని పనులు ఎలా చేయాలో తెలుసు అవి మనం పుట్టేటప్పుడు బ్రెయిన్ లో స్టోర్ చేసి ఉంటాయి అవి ఏంటంటే గుండె ఎలా పని చేయాలో నువ్వు బ్రెయిన్ కి ఏమైనా నేర్పిస్తున్నావా లేదు కదా . గుండె ని ఎలా పని చేయించాలో బ్రెయిన్ కి ముందే తెలుసు నువ్వు ఏం నేర్పించాకుండానే . ఇలా ముందే కొన్ని పనులు ఎలా చేయాలో బ్రెయిన్ లో  మెడుల్లా ఆబ్లాంగేటా (Special  Storage ) లో స్టోర్ చేసి ఉంటుంది. దీనిని మనం ఏం చేయలేము . అంటే గుండె ఎలా పని చేయాలో అది మర్చిపోతుందా ..
ఇలాగే కంప్యూటర్ లో కూడా ROM ( Red  Only  Memory )  అని ఒకటి ఉంటుంది . కంప్యూటర్ ని ఆన్ చేయగానే ఎలా ఈ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ హార్డువేర్ బాగాలు సాఫ్ట్వేర్ ని ఉపయోగించుకొని పని చేయాలో చెబుతుంది దీన్ని కంప్యూటర్ తయారు చేసేటప్పుడే కంపెనీ వారు ఇందులో ప్రోగ్రాం వ్రాస్తారు. దిన్ని మనం ఏం చేయలేము
ROM

2. నిర్ణయాలు ( డెసిషన్ )  తీసుకోవడం (  ప్రాసెసర్ processor ):
బ్రెయిన్ చేసే ఇంకో పని మన మెదడు లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం ఆ పని చేయాలా వద్దా చేస్తే వచ్చే result ఏమిటి అని . ఇలా పనిచేసేది కంప్యూటర్ లో ప్రాసెసర్ ( processor ) . ఈ ప్రాసెసర్ మీద ఆధారపడే కంప్యూటర్ లో మొత్తం పనులు జరుగుతాయి
Processor

ఇప్పుడు మనం కంప్యూటర్ కి కొత్త నిర్వచనం చెప్పవచ్చు  "  మానవుని యొక్క ఆటోమేటెడ్ వెర్షన్ (స్వయం  చాలక ప్రతి రూపమే ) నే కంప్యూటర్ . ఇది వింటుంది ఇది మాట్లాడుతుంది ఇది చూస్తుంది ఇది నిర్ణయాలు తీసుకుంటుంది "
Computer is an Automated Version  of Human It sees ,It Listens ,It sounds ,It takes Decisions  

బ్రెయిన్ ఎలా  పనిచేస్తుంది అని నాకు సరిగ్గా తెలియదు ఈ వెబ్ సైట్ ముఖ్య ఉద్దేశం  ఏమిటంటే సులభం గా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్పించడమే దాని కోసం నేను కొన్ని ఉహించి రాస్తాను ఇందులో బ్రెయిన్ గురించి రాయడం లాగా , ఏమైనా తప్పులుంటే మీకు ఉన్న మీకు ఉన్న 
sense తో correct చేసుకోండి . మీకు నచ్చితే లేదా నచ్చక పోయినా క్రింద ఒక కామెంట్ రాయండి .

10 కామెంట్‌లు:

 1. very intersting and very easy to learn every one.
  thanq somuch sir..

  రిప్లయితొలగించండి
 2. Sir ఈ article మాకు బాగా నచ్చింది మీరు unity and క c# ప్రోగ్రామింగ్ గురించి ఒక కంప్లీట్ ఆర్టికల్ రాయండి ప్లీజ్

  రిప్లయితొలగించండి
 3. Sir very very good information and simply to learn and fallow same type of concept

  రిప్లయితొలగించండి

ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని వ్రాయండి