"మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు"

కంప్యూటర్ ని ఫార్మాట్ చేసి కొత్త XP విండోస్ ఆపరేటింగ్ సిస్టం ని వేయ్యడం ఎలా ?


ఇప్పుడు మనం మన సిస్టం లో ఉన్న పాత ఆపరేటింగ్ సిస్టం ని తీసివేసి కొత్తది వేయ్యడం ఎలాగో ఇప్పుడు నేర్చుకుందాం ....

కొత్త ఆపరేటింగ్ సిస్టం వేయ్యాలి అంటే మన దగ్గర దానికి సంబందించిన సాఫ్ట్వేర్ ఉండాలి . ఇప్పుడు మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టం ని వేయ్యాలి అనుకుంటున్నాం కాబట్టి దాని సాఫ్ట్వేర్ CD మన దగ్గర ఉండాలి .

క్రింద చిత్రం లో చూపించిన విధంగా CD ఉంటుంది . ఆ CD తీసుకొని ముందుగా మనం దాని key [ కీ ] ఒకటి ఉంటుంది దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని ఉంచుకోవాలి . 
COMPUTER IN TELUGU


తర్వాత CD ని సిస్టం CD డ్రైవ్ లో పెట్టి రీస్టార్ట్ చేయాలి 

రీస్టార్ట్ చేయగానే ఇలా ముందు మనకి స్క్రీన్ మీద Press any key to boot from CD.... అని వస్తుంది అప్పుడు మీరు కీబోర్డ్ లో ఏదో ఒక key ని నొక్కండి  ..


[ నోట్:- ఒక వేళ  మీకు Press any key to boot from CD.... అలా రాకపోతే అలా రావడానికి ఎం చేయాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి ]
పైన కీ బోర్డు లో ఏదో ఒక కీ ని ప్రెస్ చేయగానే మీకు కింద కనపడిన స్క్రీన్ కనపడుతుంది .
computer in telugu

కొంచం సేపు మీరు ఏమి  చేయకుండా అలాగే కూర్చోండి ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయండి . కొంచం సేపు అయిన తర్వాత కింద కనపడిన స్క్రీన్ వస్తుంది


computer in telugu

ఈ  స్క్రీన్ లో మనకి 3 ఆప్షన్స్ కనపడుతాయి 
  1. కొత్త విండోస్ ఆపరేటింగ్ సిస్టం ని వెయ్యాలి అనుకుంటే Enter ప్రెస్ చేయండి అని 
  2. Already ఉన్న ఆపరేటింగ్ సిస్టం ని రిపేర్ చేయాలి అనుకుంటే R అనే కీ ని ప్రెస్ చేయాలి అని 
  3. అసలు ఏమి  చేయకుండా బయటకు వచ్చేయాలి  అంటే ప్రెస్ F3 అని
ఇప్పుడు మనకి కొత్త ఆపరేటింగ్ సిస్టం ని instal చేయాలి కాబట్టి Enter కీ ని నొక్కండి ఇప్పుడు మనకి కింద స్క్రీన్ కనపడుతుంది
computer in telugu

పైన స్క్రీన్ లో Microsoft వాడు వాళ్ళ అగ్రిమెంట్ License గురించి అక్కడ రాసాడు మీకు ఓపిక ఉంటే అది మొత్తం చదివి మీకు నచ్చితే మీరు వాడి conditions ఒకే అనుకుంటే F8 అని కీ ని కీ బోర్డు లో ప్రెస్ చేయండి . 
[ నోట్:-చదివినా చదవక పోయిన F8 అని కీ ని కీ బోర్డు లో ప్రెస్ చేయండి ]
computer in telugu
Add caption

 
పైన చూపించిన విధంగా  స్క్రీన్ వస్తుంది  కొంచం సేపు అలాగే ఉండండి క్రింద చూపించిన స్క్రీన్ వస్తుంది

computer in telugu
ఈ స్క్రీన్ లో మనకి ఏమి చెబుతుందంటే
  1. అంతక ముందు ఉన్న ఆపరేటింగ్ సిస్టం ని అలాగే ఉంచి రిపేర్ [Repair] చేయాలి అంటే R  అనే కీ ని ప్రెస్ చేయండి అని 
  2. అలా కాకుండా కొత్త ఆపరేటింగ్ సిస్టం ని వేయ్యాలి అంటే కీబోర్డ్ లో Esc అనే కీ ని ప్రెస్ చేయ్యండి అని 
 ఇప్పుడు మనం కొత్త ఆపరేటింగ్ సిస్టం ని వెయ్యాలి కాబట్టి Esc కీ ని ప్రెస్ చేయండి ఈ క్రింద స్క్రీన్ వస్తుంది 
computer in telugu
 ఈ స్క్రీన్ లో మీ సిస్టం లో ఉన్న drives మొత్తం ఇక్కడ కనపడుతాయి ఇందులో ముందు పాత ఆపరేటింగ్ సిస్టం c:drive లో ఉంది . నేను ముందు దాన్ని తీసేసి కొత్తది వెయ్యాలి దీని కోసం 
ముందు అందులో ఉన్న దాన్ని delete చేయాలి కాబట్టి కీ బోర్డు లో D అనే కీ ని ప్రెస్ చేయండి

computer in telugu
ఇప్పుడు Enter కీ ని ప్రెస్ చేయండి



computer in telugu
ఇప్పుడు L కీ ని ప్రెస్ చేయండి డిలీట్ చేయాలి అనుకుంటే
[నోట్ : - మీ మనసులో ఇప్పడు ఆపరేటింగ్ సిస్టం వెయ్యవద్దు అనుకుంటే Esc అనే కీ ని ప్రెస్ చేయాలి ]


హమ్మయ్య ఇప్పుడు అంతకముందు ఉన్న ఆపరేటింగ్ సిస్టం delete అయిపొయింది ఇప్పుడు కొత్తది వెయ్యాలి పైన స్క్రీన్ లో చూపించిన విధంగా unpartitioned space ని ముందు ఒక partition గా create చేసుకోవాలి దాని కోసం కీబోర్డ్ లో C కీ ని ప్రెస్ చేయాలి .
computer in telugu
పైన స్క్రీన్ లో చూపించిన విధంగా ఈ స్క్రీన్ లో drive size చూపిస్తుంది ఇప్పుడు మీరు అదే size డ్రైవ్ కావాలి అంటే enter ప్రెస్ చేయండి . లేదా మీరు ఈ డ్రైవ్ ని రెండు ముక్కలు చేయాలి అంటే అక్కడ ఒక నెంబర్ కనపడుతుందే దాని లో సగం అక్కడ టైపు చేసి enter కొట్టండి 
computer in telugu
ఇప్పుడు మనకి c:drive create అయినట్టు కనపడుతుంది ఇంకా మన పని xp ని ఇన్స్టాల్ చేయడమే కాబట్టి c:drive ని సెలెక్ట్ చేసి xp ని ఇన్స్టాల్ చేయాలి కాబట్టి Enter ప్రెస్ చేయాలి
computer in telugu

ఇప్పుడు file సిస్టం formate ని సెలెక్ట్ చేసుకోవాలి NTFS అనేది వేగవంతమైన ఫైల్ సిస్టం కాబట్టి మీరు పైన ఇమాగె లో చూపించిన విధంగా సెలెక్ట్ చేసుకొని Enter కీ ని ప్రెస్ చేయండి process జరుగుతుంది అని కింద చూపించిన విధంగా జరుగుతుంది మీరు ఏమి  చేయవద్దు అదే జరిగి రీస్టార్ట్ అవుతుంది

computer in telugu


computer in telugu

ఫైల్స్ కాపీ అవుతున్నాయి మీరు ఏమి చేయవద్దు just biscuit లు తింటూ పవన్ కళ్యాణ్ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండి సిస్టం మళ్ళి రీస్టార్ట్  అయ్యేవరకు


computer in telugu
computer in telugu 

computer in telugu 

ఇది అయిన తర్వాత సిస్టం రీస్టార్ట్ అవుతుంది . రీస్టార్ట్ అయ్యే సమయం లో స్క్రీన్ మీద first లో వచ్చినట్టు Press any key to boot from CD....వస్తుంది మీరు ఇప్పుడు కీ బోర్డు లో ఏ కీ ని ప్రెస్ చేయకూడదు 
computer in telugu
 అలాగే ఉంటే నెక్స్ట్ మనకి క్రింద స్క్రీన్ కనపడుతుంది
computer in telugu

మీరు ఏమిచేయకుండా చూస్తూ ఉండండి క్రింద కనపడే స్క్రీన్స్ వస్తుంటాయి

computer in telugu

computer in telugu

computer in telugu


next  ని ప్రెస్ చేయండి

computer in telugu

next  ని ప్రెస్ చేయండి 

computer in telugu

పైన కనపడే స్క్రీన్ లో name అని కనపడే దగ్గర మీ ఇష్టం వచ్చిన పేరు ఇచ్చి next press చేయండి క్రింద కనపడే స్క్రీన్ లో కీ ని అడుగుతుంది మీరు ఇంతకముందు పేపర్ మీద రాసుకున్న దాన్ని టైపు చేయండి .
పేపర్ మీద రాసుకోవడం మర్చిపోయారా పర్వాలేదు మీరు ఇప్పుడు cd ని cd drive లో నుండి తీసి టైపు చేసి మళ్ళి cd drive లో పెట్టి నెక్స్ట్ నొక్కండి

computer in telugu


next  ని ప్రెస్ చేయండి 
 
computer in telugu
 computer in telugu 

పైన స్క్రీన్ టైం సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ GMT +5. 30 చెన్నై ని కోల్కత్త ముంబై .. ని సెలక్ట్ చేసుకొని next ప్రెస్ చేయాలి .
computer in telugu




computer in telugu

కొంత టైం wait చేయండి నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది

computer in telugu 

ప్రెస్ ఓకే [ ok ] 
computer in telugu

ప్రెస్ ఓకే [ ok ] 

computer in telugu

ప్రెస్ next

computer in telugu



computer in telugu

పైన స్క్రీన్ లో not right now క్లిక్క్ చేసి Next నొక్కండి

computer in telugu

your name అనే చోట ఏదో ఒక పేరు టైపు చేసి next కొట్టండి

computer in telugu

మళ్ళి next  కొట్టండి

computer in telugu

హమ్మయ్య అయిపొయింది
computer in telugu

computer in telugu

ఇంకా cd ని cd drive లో నుండి తీసి ఎంజాయ్ చేయండి 

మీకు అర్ధం అయిందో లేదో నాకు తెలియాలి అంటే మీరు కామెంట్ తప్పని సరిగా రాయండి 












4 కామెంట్‌లు:

ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని వ్రాయండి