"మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు"

డేటా & డేటా టైపు అంటే ఏమిటి ? ఎన్ని రకాలు ?

మనం కంప్యూటర్ లో స్టోర్ చేసే ప్రతి దానిని డేటా అంటాం . కంప్యూటర్ లో మనం ఏమేమి స్టోర్ చేసుకుంటామో ఒకసారి చూద్దాం .
ప్రధానం గా మనం కంప్యూటర్ లో కీ బోర్డు ఉపయోగించి టైపు చేస్తాం . టైపు చేసినదాన్ని దాచుకుంటాం . కంప్యూటర్ ద్వారా ఏదైనా పని చేయాలి అన్నా మనం దానికి కావలిసిన సమాచారాన్ని కీబోర్డ్ ద్వారా నే ఇస్తాం . ఉదాహరణకు ఇప్పుడు కంప్యూటర్ లో calculator లో రెండు నంబర్స్ కూడిక చేయాలి అంటే ఆ  నంబర్స్ ని కీ బోర్డు ద్వారా నే ఇస్తాం కదా అలాకంప్యూటర్ ద్వారా జరిగే పనులకు కావాల్సిన సమాచారాన్ని కీ బోర్డు ద్వారా నే ఇస్తాం .


కంప్యూటర్ లో ఇలా చాలా పనులు  మ్యూజిక్ ప్లేయర్ , సినిమా చూడటం ఇలా ఎన్నెన్నో పనులు ఉంటాయి , మ్యూజిక్ ప్లేయర్ లో సాంగ్స్ ప్లే చేయాలి అంటే .. సాంగ్స్ ని మనం కంప్యూటర్ లో స్టోర్ చేసుకున్న వాటి నుండి ఒక పాటని ప్లే చేస్తాం కదా ..


ఇలా కంప్యూటర్ పని జరగాలంటే దానికి సంబందించిన సమాచారం మనం ఇవ్వాలి లేక పోతే కంప్యూటర్లో ముందే స్టోర్ చేసుకొని ఉండాలి .

ఇలా కంప్యూటర్ కి మనం కీ బోర్డు ద్వార ఇచ్చే సమాచారం కూడా కంప్యూటర్ లోనే దాచుకుంటాం అన్న విషయం మీకు పైన చెప్పాను . . ఈ సమాచారాన్నే మనం డేటా అంటాం . డేటా లో చాలా రకాల అక్షరాలను వాడుతుంటాం

అవి
 •  అంకెలు  
 • అల్ఫబెటికాల్స్ ( A B C ...)
 • సింబల్స్ ( $#@^%&*()_{}+।?><!~ ... )
ఈ అంకెలు అల్ఫబెటికాల్స్ సింబల్స్ అన్ని డేటా లో మనం వాడుతుంటాం . ఈ డేటా లో వాడే అంకెలలో మళ్ళి కొన్ని రకాలు ఉన్నాయి అని సహజ సంఖ్యలు , పూర్ణ సంఖ్యలు , కరణియ సంఖ్యలు .. అలాగే అల్ఫబెటికాల్స్ లో  మళ్ళి క్యారెక్టర్స్ , స్త్రింగ్స్ ఉన్నాయి .

మనం అవసరాన్ని బట్టి మనకి కావాల్సిన డేటా ని వాడుతుంటాం .
ఉదాహరణకు : రెండు అంకెలను కూడలి అంటే మనం 2 నంబర్స్ ని మాత్రమే తీసుకుంటాం అలా అని రెండు అల్ఫబెట్స్ ని తీసుకొం కదా

డేటా లో ఉండే రకరకాలను మనం డేటా టైప్స్ అంటాం
డేటా టైప్స్ :
మనం సి లాంగ్వేజ్ లో వాడే డేటా టైప్స్ అనేవి  ప్రధానం గా రెండు రకాలు
 1. నంబర్స్ డేటా టైపు (Numerical Data Type )
 2. క్యారెక్టర్ డేటా టైపు ( Character Data  Type  )
COMPUTER IN TELUGU
  1. నంబర్స్ డేటా టైపు (Numerical Data Type )
  ఈ Numerical Data Type లో మనం నంబర్స్ ని వాడుకుందాం ఇందులో మళ్ళి రెండు రకాలు . 
  మనం వాడే  నంబర్స్ లో . ( పాయింట్ ) లేకుండా వాడే నంబర్స్ ని Integers అంటారు .
  మనం వాడే  నంబర్స్ లో . ( పాయింట్ ) ఉంటే ఆ నంబర్స్ ని Floating Points అంటారు .
  Integers : Integers అంటే పాయింట్ లేకుండా ఉండే నంబర్స్ మళ్ళి  Positive Integers , Negative Integers రెండు ఉంటాయి కదా . పాజిటివ్ కి + గుర్తు , నెగటివ్ కి - గుర్తు వాడుతాం కదా. ఈ + , - గుర్తులను sign అంటారు .

  • పాజిటివ్ మరియు నెగటివ్ రెండు ఉన్న నంబర్స్ ని signed integers అంటారు  +1 , +2 ,+3 , -1,-2,-3
  • కేవలం పాజిటివ్ మాత్రమే ఉన్న నంబర్స్ ని unsigned integers అంటారు 1,2,3,4
   మళ్ళి ఈ రెండిట్లో 3 రకాలు ఉన్నాయి అవి ఎలా అంటే 3 వేరు వేరు రకాల డబ్బాలు తీసుకోండి కింద చూపించిన విధంగా
  computer in telugu
   ఒక్కొక్క డబ్బా లో ఒక్కొక్క ఐటెం పెట్టాలి . సరే  నా దగ్గర ఒక ఐటెం ఉంది అది చిన్న డబ్బా లో సరిపోయే అంత అప్పుడు అది చిన్న డబ్బా లో పెడితే సరిపోతుంది కదా అలా  అని అది పెద్ద డబ్బా లో కూడా సరిపోతుంది కదా అని పెద్ద డబ్బాలో పెడితే , తర్వాత పెద్ద డబ్బాలో  గలిగే వస్తువు ఉంటే దాన్ని పెట్ట లేము కదా
  దీనిని బట్టి మీకు ఏం అర్ధం అయింది వస్తువుని బట్టి ఏది అవసరం అయితే దాన్నే వాడాలి
  ఎన్నో ఎన్నెన్నో సార్లు మీకు చెప్పాను కంప్యూటర్ లో చేసే ప్రతిది కంప్యూటర్ మెమరీ లో స్టోర్ అవుతుంది అని కదా గుర్తుందా  పోతే మళ్ళి అంతకముందువి చదవండి 

  ఇప్పుడు ఈ integers లో వాడే  1,2,3,+6 ,+5, -7  లు కూడా కంప్యూటర్ మెమరీ లో స్టోర్ అవుతాయి . మనం వాడే  నంబర్స్ బట్టి కంప్యూటర్ మెమరీ లో డేటా అనేది ఎంత స్థలం ఆక్రమిస్తుందో చెప్పగలం .

  Signed, Un signed integers లో ఒక్కొక్క దానిలో 3 రకాలు ఉంటాయి అన్నాను కదా అవి
  1. short integers 
  2. integers 
  3. long  integers 
  • నాకు నంబర్స్ అనేవి -128 నుండి +127 వరకు మాత్రమే కావాలి  అనుకుంటే అప్పుడు signed short integers క్రింద వస్తాయి అదే unsigned short  integers అయితే 0 నుండి 255 వరకు ఉంటాయి ( నెగటివ్ నంబర్స్ ఉండవు ) ఇవి మెమరీ లో 8 - బిట్స్ లో ( విండౌస్ ఆపరేటింగ్ సిస్టం లో ) స్టోర్ అవుతాయి .
  • నంబర్స్ అనేవి -32,768 నుండి +32,767 వరకు మాత్రమేకావాలి అనుకుంటే అప్పుడు signed integers క్రింద వస్తాయి అదే unsigned integers అయితే 0 నుండి 65535 వరకు ఉంటాయి ఇవి మెమరీ లో 16 - బిట్స్ లో ( విండౌస్ ఆపరేటింగ్ సిస్టం లో ) స్టోర్ అవుతాయి .
  •  నంబర్స్ అనేవి -2,147,483,648 నుండి +2,147,483,647 వరకు మాత్రమేకావాలి అనుకుంటే అప్పుడు signed integers క్రింద వస్తాయి అదే unsigned integers అయితే 0 నుండి 4,294,967,295 వరకు ఉంటాయి ఇవి మెమరీ లో 32 - బిట్స్ లో ( విండౌస్ ఆపరేటింగ్ సిస్టం లో ) స్టోర్ అవుతాయి .
   ఈ integers ని " సి  లాంగ్వేజ్ " లో వాడుకోవాలి అంటే ప్రతి దానికి ఒక keyword అండ్ control string ఉంటుంది . keyword అంటే ఏమిటి అంటే కంప్యూటర్ కి ఆ పదం తో చేపితేనే అర్ధం అయ్యేది . control string అంటే కంప్యూటర్ మెమరీ లో స్టోర్ అయిన దాన్ని మనం మెమరీ నుండి తీసి వాడుకోవడానికి ఉపయోగపడేది

  ఉదాహరణకు ఇప్పుడు signed short integers ని సి లాంగ్వేజ్ లో వాడాలి అంటే దానికి ఒక కీ వర్డ్ ఉంది దాన్ని ఉపయోగిస్తేనే కంప్యూటర్ కి అర్ధం అవుతుంది అది ఏమిటంటే signed short int లేదా short  int  లేదా int  మరియు control string వచ్చి %d 

  అబ్బబ్బా ఈ key words control strings తొక్కలో గోల ఏంటి రా బాబు అనుకుంటున్నారా చదవండి దీని మీదనే తర్వాత వచ్చే topics అన్ని ఆధారపడి ఉన్నాయి చాలా important . తర్వాత topics లో మనం వీటిని ఎలా వాడుకోవాలో చెబుతాను

  క్రింద టేబుల్ లో మిగతా డేటా టైప్స్ keywords control strings ఉన్నాయి చూడండి
  DATATYPE NAME
  KEYWORD
  MEMORY SIZE
  RANGE
  CONTROL STRING
  SIGNED SHORT INTEGER
  signed short int
  (or)
  signed short
  (or)
  short
  8-bits
  -128 TO +128
  %d
  SIGNED  INTEGER
  signed  int
  (or)
  int
  16-bits
  -32768 TO +32767
  %d
  SIGNED  LONG INTEGER
  signed long int
  (or)
  signed long
  (or)
  long
  32-bits
  -2,147,483,648 TO -2,147,483,647
  %ld
  UN SIGNED SHORT INTEGER
  unsigned short int
  (or)
  unsigned short
  8-bits
  0 TO 255
  %u
  SIGNED  INTEGER
  unsigned  int
  16-bits
  0 TO 65535
  %u
  SIGNED  LONG INTEGER
  Un signed long int
  (or)
  unsigned long

  32-bits
  0 TO 4,294,967,295
  %lu
   

  Floting Points: Floating points అంటే పాయింట్ తో ఉండే నంబర్స్  ని ఫ్లోటింగ్ పాయింట్స్ అంటారు. ఉదాహరణకు 12.35, 0.23565 ఇలాంటివి 

   మళ్ళి ఈ ఫ్లోటింగ్ పాయింట్స్ లో 3  రకాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే 
  1. Float 
  2. Double 
  3. Long Double 

  3 కామెంట్‌లు:

  ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని వ్రాయండి