"మంచోడికి మంచేదో చెప్పాల్సిన అవసరం లేదు. చెడ్డోడికి చెప్పినా పట్టించుకోడు"

15. Backslash ( \\ ) Question mark ( \? ) Single quotation mark( ' ) Double quotation mark ( \" )


ఇప్పుడు మనకు ప్రోగ్రాం output లో  స్లాష్ ( \ ) అనేది కావాలి అనుకుందాం

ఉదాహరణకు : నాకు output  అనేది క్రింద  చూపించిన విదంగా రావాలి అనుకుందాం

sivanaadhbaazi\sivanaadh

ఇలా  రాసిన విదంగా నాకు output  రావాలి అంటే దానికి మనం printf ఉపయోగించి ఎలా రాస్తామో చూద్దాం .

ఇలా పైన చూపించిన విధంగా వ్రాస్ output  అనేది స్లాష్ ( \ ) తో రాదు . ఈ ప్రోగ్రాం  output క్రింద చూపించిన విదంగా వస్తుంది .

output : sivanaadhbaazisivanaaadh

అని స్లాష్ ( \ ) లేకుండా వస్తుంది . ఇంతకముందు పాఠాలు మీరు చుస్తే \n \r \a \v \t \b ప్రతి దాంట్లో స్లాష్ ( \ ) తర్వాత ఏదో ఒక character . నేను అంతకముందు పాఠాలలో చెప్పాను స్లాష్ (\) అనేది Escape Sequence అని అంటే ఎప్పుడైతే printf లో స్లాష్ ( \ ) కనిపిస్తుందో దాని తర్వాత character బట్టి అది  output లో డిజైన్ చేస్తుంది . పైన ప్రోగ్రాం లో స్లాష్ ( \ ) తర్వాత S అనే క్యారెక్టర్ ఉంది కానీ దానికి సంబందించిన డిజైన్ ఏం  లేదు కాబట్టి printf  అనేది స్లాష్ (\) ని వదిలేసి దాని తర్వాత ఉన్నది అలాగే ప్రింట్ చేస్తుంది .

మరి స్లాష్ ని ప్రింట్ చేయడం ఎలా?
సార్   కోప్పడకండి అక్కడికే వస్తున్నా , ఏం లేదు చాలా సులభం printf లో ఎక్కడైతే  స్లాష్ ప్రింట్ అవ్వాలి అనుకుంటామో అక్కడ ఒకే చోట రెండు స్లాష్ లు రాయాలి అంతే . ప్రోగ్రాం క్రింద ఉంది చూడండి
తెలుగు లో కంప్యూటర్
అలాగే మనకి ఔట్పుట్ లో ? (question mark ) గాని Double Quotation (") గాని రావాలి అంటే printf లో ఎక్కడైతే అవి రావాలో దాని ముందు ఒక స్లాష్ పెట్టాలి .
అదే single quotation (') అయితే మాములుగా  printf లో రాస్తే సరిపోతుంది

10 కామెంట్‌లు:

  1. exacellent expalination in printf statements............

    రిప్లయితొలగించండి
  2. excellent And Superb Explanation is superb
    please upload complete tutorial..

    రిప్లయితొలగించండి

ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు ఉపయోగపడితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని వ్రాయండి